ధమాల్ ఫోర్ చిత్రంపై స్పందించిన నటి అంజలి ఆనంద్ తల్లి
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
ధమాల్ ఫోర్ చిత్రంపై తన తల్లి చేసిన వ్యాఖ్యలను నటి అంజలి ఆనంద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫరా ఖాన్ వ్లాగ్ కార్యక్రమంలో పాల్గొన్న అంజలి, తన సినిమాను తల్లి కేవలం ఒక్కసారి చూడదగిన చిత్రంగా అభివర్ణించినట్లు తెలిపారు. తన నటనను కూడా సాధారణంగా ఉందంటూ ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా స్పందించారని అంజలి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో తన అవకాశాలపై తల్లి తొలుత సందేహం వ్యక్తం చేసినట్లు అంజలి వెల్లడించారు.