బైకుల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు 13 నెలల జైలు శిక్ష

రిపోర్టర్: D.SATHISH స్థలం: గొల్లప్రోలు

బైకుల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు పిఠాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకట అపర్ణ 13 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. 2026 ఫిబ్రవరి 18న గొల్లప్రోలు శివాలయం వద్ద నమోదైన ఈ కేసుకు సంబంధించి నిందితులు విత్తనాల దుర్గాప్రసాద్, మజ్జి నరేంద్రకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.