'వినాయక మండపాల వద్ద రికార్డింగ్ డ్యాన్సులు': తెలుగు స్క్రైబ్ వెల్లడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కాకినాడ రూరల్

కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుగు స్క్రైబ్ వెల్లడించారు. పవిత్రమైన వినాయక వేడుకల్లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా తెలుగు స్క్రైబ్ బయటపెట్టారు.