వీల్ చైర్లు లేక పురుషోత్తపురంలో వృద్ధ ఓటర్ల తీవ్ర అవస్థలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సర్బుజ్జిలి
శ్రీకాకుళం జిల్లా సర్బుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. పోలింగ్ కేంద్రంలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. వైద్య సిబ్బంది వీల్ చైర్లు అందుబాటులో ఉంచకపోవడంతో వయోవృద్ధులు, దివ్యాంగ ఓటర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు వెంటనే వీల్ చైర్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.