ఎస్సీ ఎస్టీ సవరణ చట్టం పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టం-2018ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టంలోని కఠిన నిబంధనలను పునరుద్ధరించడాన్ని సవాలు చేసే వ్యాజ్యాన్ని విచారించేందుకు సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. 2018 నాటి సవరణ చట్టం చెల్లుబాటును 2020లోనే సుప్రీంకోర్టు సమర్థించిందని బెంచ్ గుర్తుచేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.