తెలంగాణలో పెరగనున్న ఆటో ఛార్జీలు: ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. తొలి 1.6 కి.మీలకు రూ.30, ఆ తర్వాత కి.మీకు రూ.14 వసూలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ సర్కార్ ఆమోదం తెలపగానే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల సామాన్యులపై భారం పడనుంది.