ఖమ్మంలో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ బోట్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
రిపోర్టర్: అశోక్
స్థలం: Khammam
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర ఆరా తీశారు. గల్లై్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా వెనక్ కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణమే రెస్క్యూ బృందాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.