నోయిడా కంపెనీలో ఐఐటీ మద్రాస్ విద్యార్థికి భారీ స్టైపెండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: Chennai

ఐఐటీ మద్రాస్ బీఎస్ విద్యార్థి ఆదిత్య మిశ్రా నోయిడాలోని బెస్ట్ డీల్ పైసా సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఆధారిత ఇంటర్న్షిప్ను దక్కించుకున్నట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఈ ఇంటర్న్షిప్లో భాగంగా అతనికి ప్రతినెలా తొంబై ఐదు వేల రూపాయల స్టైపెండ్ లభించనుందని అధికారులు వెల్లడించారు. పైథాన్ ఫ్లాస్క్ పై అతనికి ఉన్న అనుభవం ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.