ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల దాడులు: రాహుల్ గాంధీ పోస్ట్ను షేర్ చేసిన మంత్రి

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు, బీజేపీ గూండాలు దాడులకు పాల్పడటం గర్హనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే షేర్ చేశారు. ప్రేమతో వచ్చిన వారిని హింసించడం సరైన పద్ధతి కాదని, తాము భారతీయులుగా సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు మంత్రి తన ఖాతా ద్వారా తెలిపారు.