రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో భారీగా నామినేషన్లు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వేకోడూరు
రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. ఓబులవారిపల్లి మండలంలో అత్యధికంగా ఇరవై ఐదు నామినేషన్లు నమోదయ్యాయి. పుల్లంపేటలో పద్దెనిమిది, పెనగలూరులో పదిహేడు, రైల్వేకోడూరులో పదిహేడు, చిట్వేల్లో పన్నెండు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు.