తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు: పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి విహారం

రిపోర్టర్: అశోక్ స్థలం: Tirumala

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలసి గోవిందరాజస్వామి అలంకారంలో పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారని టీటీడీ వెల్లడించింది. ఆదిశేషుని అంకిత సేవకు ప్రతిరూపంగా సాగిన ఈ దివ్యమంగళ స్వరూపుని దర్శనాన్ని భక్తజనం కనులారా వీక్షించారు. భక్తి పారవశ్యంతో స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తులు పరవశించిపోయారని, ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారని పేర్కొంటూ టీటీడీ ట్వీట్ చేసింది.