విజయనగరం: జనసేన నాయకురాలు గురాన రాధిక జన్మదిన వేడుకలు
రిపోర్టర్: తాడి
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణంలో జనసేన సీనియర్ నాయకులు గురాన అయ్యలు సతీమణి, సమాజ సేవకురాలు గురాన రాధిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలు, వృద్ధాశ్రమాల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
జీఎస్ఆర్ హోటల్లో పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించడం పట్ల జనసేన నాయకురాలు గురాన రాధిక అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.