నెత్తురోడిన జాతీయ రహదారిపై వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

జిల్లా పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైనట్లు స్థానికులు మరియు పోలీసులు వెల్లడించారు. కోట మండలంలో మిరపనారుకు నీరు కట్టేందుకు వెళ్లిన సూళ్లూరు గురవయ్యపై తేనెటీగలు దాడి చేయడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. నెల్లూరు గ్రామీణ మండలం మట్టెంపాడు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో వెంకటాచలం రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు.