నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఇస్రో జీఎస్ఎల్‌వి-F17 రాకెట్!

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రక ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈఓఎస్-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్‌వి-F17 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. ఈ ఏడాది గగన్‌యాన్ తొలి మానవరహిత మిషన్ చేపడుతామని స్పష్టం చేశారు.