పేరు మార్చుకున్న పల్నాడు జాయింట్ కలెక్టర్ సంజనా సింహా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వి.సంజనా సింహా తన పేరును మార్చుకున్నారు. తన పేరును వి.సంజనా సింహ నుంచి సంజనా శ్రీహర్షగా మారుస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 19, 2026 న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పుకు సంబంధించిన ప్రతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అకౌంటెంట్ జనరల్ మరియు యూపీఎస్సీ సంబంధిత విభాగాలకు పంపించారు.