ఖమ్మం జమ్మిబండ వద్ద దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జెడ్పీ సెంటర్లోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జమ్మిబండ వద్ద దసరా రోజున సాయంత్రం ఆరు గంటలకు జాతర ప్రారంభం కానుంది. రాక్షస సంహారం, జమ్మి చెట్టుపై పాలపిట్ట దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.