నవరాత్రి వేడుకల్లో ముస్లింల భాగస్వామ్యంపై అమృత ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: మహారాష్ట్ర

నవరాత్రి వేడుకల్లో ముస్లింలు పాల్గొనడంలో ఎలాంటి తప్పులేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ స్పష్టం చేశారు. పండుగలు అందరికీ చెందినవని, ముస్లింలు కూడా వచ్చి వేడుకలను ఆనందించడంలో తప్పులేదని ఆమె ముంబైలో తెలిపారు. అయితే, నవరాత్రి ఉత్సవాల్లోకి ముస్లింలను అనుమతించకూడదంటూ విశ్వహిందూ పరిషత్, మంత్రి నితేష్ రాణే చేసిన డిమాండ్ల నేపథ్యంలో అమృత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.