బెల్లంపల్లి పద్నాలుగో వార్డులో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని 14వ వార్డులో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా, సంప్రదాయబద్ధంగా అలంకరించిన మహిళలకు మొదటి, రెండో, మూడో బహుమతులుగా చీరలను టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి అందజేశారు. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో కాస్మోటిక్స్ బ్యూటీ కిట్లను నిర్వాహకులు పంపిణీ చేశారు.