నోయిడా నిఠారీ హత్యల కేసు నిందితుడు సురేందర్ కోలీ ఆత్మహత్య

రిపోర్టర్: విజయ్ స్థలం: నోయిడా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లోని నోయిడా నిఠారీ హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేందర్ కోలీ హరిద్వార్‌లోని ఓ టీ స్టాల్ వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామికవేత్త మొహిందర్ సింగ్ పంధేర్ ఇంట్లో పనిచేసిన కోలీపై 19 మంది పిల్లలు, యువతులపై అత్యాచారాలు చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాల లోపం వల్ల గతంలో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేయగా, తాజాగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం గమనార్హం.