విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం జిల్లాలో మిగిలిన ఇరవై ఐదు రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. గురువారం అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించామని, ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు.