కరప మండల ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ రూరల్
కరప మండల ప్రత్యేక అధికారిగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ జి. శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ పదవీకాలం ముగియడంతో జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ జె. శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాస్, స్వర్ణ పంచాయతీ అధికారి కర్రి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.