నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏఐఏపీజీఈటీ ఫలితాలు విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీ 2026 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 51,482 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 49,864 మంది హాజరయ్యారు. ఆయుర్వేద, హోమియోపతి, సిద్దా, యునాని విభాగాలకు సంబంధించిన స్కోర్‌కార్డులను అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.