ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వివరాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ పోర్టల్లో ఫీజు వివరాలు నమోదు చేయని ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఫీజులు, అదనపు వసూళ్లు, పుస్తకాల ఖర్చులపై స్పష్టత లేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు నమోదు చేయని యాజమాన్యాలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి, విద్యా హక్కు చట్టం ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.