టీమిండియాకు భారీ షాక్: స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించిన ఐసీసీ

రిపోర్టర్: శివ స్థలం: ముల్లాన్‌పూర్

ముల్లాన్పూర్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఆఖరి వన్డేలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైందని, స్లో ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కింద ఐసీసీ జరిమానా విధించిందని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ వెల్లడించారు. ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయనందుకు గాను భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం కోత విధించామని అధికారులు స్పష్టం చేశారు.