కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతల తీవ్ర నిరసన

రిపోర్టర్: అశోక్ స్థలం: పెద్దపల్లి

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.