ఫుట్బాల్ దిగ్గజాలపై రోనాల్డో సంచలన వ్యాఖ్యలు: మెస్సీకి ఇంగ్లీష్ నేర్పించానని వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: Portugal
గతంలో తాను ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి అవార్డు వేడుకల్లో ఇంగ్లీష్ అర్థం కాకపోతే సహాయం చేశానని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో వెల్లడించారు. సీఎన్ఎన్ పోర్చుగల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తమ మధ్య మైదానంలో ఎంతటి పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన ప్రత్యర్థిత్వం తమను మరింతగా మెరుగైన ఆటతీరు కనబరిచేలా ప్రోత్సహించిందని రోనాల్డో గుర్తుచేశారు.