అట్టహాసంగా అట్టహాసం చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న తాజా సినిమా అట్టహాసం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ మంగళవారం ఘనంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం కీలక పాత్రలు పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. రెండు జంటల కథతో సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా సాగుతుందని, త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.