జామి మండలం అలమండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన లలిత కుమారి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో కొల్లా లలిత కుమారి పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లలిత కుమారి విజయనగరం వెల్లడించారు.