కొరుట్ల పట్టణంలో వీధికుక్కల బీభత్సం: బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైనం

రిపోర్టర్: సతీష్ స్థలం: కోరుట్ల

కోరుట్ల పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా కరవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.