మల్లన్నసాగర్ నిర్వాసితులకు భారీ ఊరట: ఎల్ఆర్ఎస్ ఫీజు పూర్తి మినహాయింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్ధిపేట

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పునరావాసం పొందిన ముంపు బాధితులకు ఎల్ఆర్ఎస్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది.