రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఆరు కోట్ల విలువైన పార్కు స్థలం కబ్జా తొలగింపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి సర్కిల్ పరిధిలోని నేక్నంపూర్ వెంకటేశ్వర కాలనీలో ఆరు కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కమర్షియల్ షెటర్లను అధికారులు నేలమట్టం చేశారు. సర్వే నెంబర్ 22 నుంచి 26 పరిధిలోని 400 గజాల స్థలాన్ని ఆక్రమించి ఎనిమిది షెటర్లను నిర్మించి అద్దెకు ఇస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో, ఏసీపీ ప్రసీద, టీపీఎస్ రమేష్ ఆధ్వర్యంలో శనివారం జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు.