యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించేలా సీబీఎస్ఈ ప్రత్యేక కార్యక్రమం
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆదివారం నషా ముక్త్ యువా ఫర్ విక్షిత్ భారత్ అనే అంశంపై నడపించిన నడక కార్యక్రమంలో నిపుణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిపుణులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, మెదడుపై వాటి ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా జరిగే అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్సీబీ అధికారులు విద్యార్థులకు సూచించారు.