కోలీవుడ్లో కలకలం: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ ఒక్కటి కాబోతున్నారా
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ వివాహ బంధం మరియు విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్ది నెలల క్రితం చైన్నె ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తిరిగి ఒక్కటయ్యే ప్రయత్నంలో ఉన్నట్లు తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాలపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.