పూణేలో విషాదం: కొడుకుతో కలిసి భవనంపై నుంచి దూకి తల్లి ఆత్మహత్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Pune
మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి-చించ్వాడ్లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుందని వాకడ్ పోలీసులు వెల్లడించారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏక్తా బంగాడ్ అనే మహిళ, తన ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి నివాస భవనం పద్దెనిమిదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని స్పష్టం చేశారు.