'వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలి': సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్‌ చేపట్టనున్న చమురుశుద్ధి, పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అమరావతిలో బీపీసీఎల్‌ సీఎండీ సంజయ్‌ ఖన్నాను కోరారు. రిఫైనరీ నిర్మాణానికి అవసరమైన భూములను త్వరలోనే పూర్తిగా అప్పగిస్తామని, సమీపంలో డౌన్‌స్ట్రీమ్‌ పెట్రోకెమికల్‌ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సంజయ్‌ ఖన్నా సీఎంకు వివరించారు.