ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జనసేన కోఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జన్నారం

జన్నారం మండలంలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ స్పష్టం చేశారు. మురిమడుగు గ్రామంలో దళితుల ఇళ్ల సమీపంలో అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.