విజయనగరం సంగీత కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎంపీ కలిశెట్టి
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఆదివారం రాత్రి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వయొలిన్ సోలో కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. సంగీత కళాకారుల సేవలు విశిష్టమైనవని కొనియాడారు. ఈ కళాశాల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.