ఆస్తి కోసం నకిలీ కుమారుడిని సృష్టించిన కేటుగాళ్ల గుట్టు రట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేటకు చెందిన వృద్ధ దంపతులు లక్ష్మారెడ్డి, రాములమ్మల ఆస్తిని కాజేసేందుకు మోహన్రెడ్డి అనే వ్యక్తి దారుణమైన కుట్ర పన్నాడని ఎస్ఐ భాస్కర్రావు తెలిపారు. ఇరవై మూడు సంవత్సరాల క్రితం తప్పిపోయిన వారి కుమారుడు శ్రీనివాస్రెడ్డిగా నకిరేకల్కు చెందిన యాదయ్యతో నటింపజేసి వృద్ధులను నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బంధువుల అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగి విచారించడంతో అసలు నిజాలు వెలుగుచూశాయని, నకిలీ కుమారుడిని అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.