పదిహేనేళ్ల ఐటీ ఉద్యోగం కోల్పోయిన ప్రవాస భారతీయుడి ఆవేదన
రిపోర్టర్: హరి
స్థలం: అమెరికా
అమెరికాలో పదిహేనేళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఒక భారతీయ టెకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. గత మూడేళ్లుగా కంపెనీలో ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని, చివరికి తన వంతు వచ్చిందని ఆయన తెలిపారు. ఆటోమేషన్ వల్ల ఐటీ ఉద్యోగాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ, ఉద్యోగులు ముందుగానే పొదుపు, పెట్టుబడులతో బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.