నెల్లూరులో హానికర రంగులతో విక్రయిస్తున్న హోటళ్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార భద్రతా ప్రమాణాలను విస్మరిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని ఆరోగ్య అధికారి దినేష్ తెలిపారు. నగరంలో సుమారు ఐదు వేల వరకు హోటళ్లు ఉండగా, చాలా చోట్ల హానికరమైన రంగులు, కాలం చెల్లిన రసాయనాలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. రోజుల తరబడి ఫ్రిజ్ల్లో నిల్వ ఉంచిన పదార్థాలను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని హోటళ్లపై తరచూ తనిఖీలు నిర్వహించి సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.