నేపాల్ హిమపాత ప్రమాదం: వైన మృతుల సంఖ్య పదిహేనుకు చేరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: Nepal

నేపాల్లోని హిమ్లుంగ్ హిమాల్ ప్రాంతంలో సంభవించిన భారీ హిమపాత ప్రమాదంలో మృతుల సంఖ్య పదిహేనుకు చేరినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తాజాగా సహాయక బృందాలు జరిపిన గాలింపు చర్యల్లో మరో ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు వారు తెలిపారు. మానాంగ్ జిల్లా పరిధిలోని బేస్ క్యాంప్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన మరో వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.