పూరీ బీచ్లో అద్భుత శిల్పం: పండ్లు, కూరగాయలతో అమ్మవారి ప్రతిమ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పూరీ
దుర్గా పూజ సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించినట్లు తెలిపారు. దాదాపు ఎనిమిది టన్నుల ఇసుకతో పాటు ముప్పై రెండు రకాల పండ్లు, కూరగాయలను ఉపయోగించి పది అడుగుల ఎత్తులో ఈ వినూత్న ప్రతిమను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని సృష్టించినట్లు సుదర్శన్ పట్నాయక్ వెల్లడించారు.