'పెట్రోల్ పోసి కాలుస్తాం': కడపలో అన్నదమ్ముల బీభత్సం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కడప
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్లో చిన్నారి పుట్టినరోజు వేడుకల సమయంలో తలెత్తిన వివాదం ముగ్గురు అన్నదమ్ముల దాడికి దారితీసింది. అమృతనగర్కు చెందిన సురేశ్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండగా వేడుకల కారణంగా మరో వీధి నుంచి వెళ్లాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సురేశ్ తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి వచ్చి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి కాలుస్తామంటూ బెదిరింపులకు దిగడంతో బాధితులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు.