'నైపుణ్యాల అభివృద్ధియే యువతకు నిజమైన రక్షణ': విశాఖ ఎంపీ శ్రీభరత్
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే యువత భవిష్యత్తుకు నిజమైన రక్షణ అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నంలోని ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. విశాఖను ఐటీ, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడానికి బలమైన నెట్‌వర్క్ ఎఫెక్ట్స్ సృష్టిస్తున్నామని, అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ అనుసంధానంతో డేటా సెంటర్లు, ఏఐ రంగాలకు ఇది కేంద్రంగా మారుతుందని తెలిపారు.