కేసీఆర్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ భారీ మహా ధర్నా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 6న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ మహా ధర్నాకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలకు ఒక్క రోజు ముందు ఈ నిరసన చేపట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కీలక సన్నాహక సమావేశం జరగనుంది.