పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహశీల్దార్ పిలుపు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని ఐదో వార్డులో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో తహశీల్దార్ రవిచంద్ర రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం అందించిన సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం గురించి వివరించారు. ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి మెలగాలని, ఇతరుల హక్కులను గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.