అనంతపురం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం ఉద్ధృతికి పెంచులపాడు వంక పొంగి ప్రవహిస్తుండటంతో పెంచులపాడు మరియు పొలికి గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో ప్రాంతంలో చల్లని వాతావరణం నెలకొంది.