చట్టాన్ని అతిక్రమిస్తే కటకటాలే: రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అనంతపురం
చట్టాన్ని అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అనంతపురం ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించినట్లు అనంతపురం పోలీసులు వెల్లడించారు. ఎన్నికల వేళ గ్రామగ్రామాన ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. బైండోవర్ అయిన వ్యక్తులు మరియు రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.