వినాయక మండపాలకు ఈ నెల 26 వరకు తాత్కాలిక విద్యుత్ సరఫరా

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

వినాయక చవితి ఉత్సవాల మండపాలకు ఈ నెల 26 వరకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. 500 వాట్లకు రూ.1,000, వెయ్యి వాట్లకు రూ.2,250 రుసుము నిర్ణయించారు. సచివాలయాలు, వెబ్‌సైట్, మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ విద్యుత్ వినియోగిస్తే కేసులు తప్పవని, భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.