తుఫాన్ వేళ మత్స్యకారులకు అండగా నిలిచిన పలాస ఎమ్మెల్యే శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక, మంచినీళ్లపేట, హుకుంపేట గ్రామాల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. తుఫాన్ ప్రభావం వల్ల సముద్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె స్వయంగా తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించారు.